- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా ట్రేడ్ డీల్‌తో భారత ఎగుమతులకు జోష్
భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడానికి అంగీకరించాయి. మార్చి నెలలో ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయి.

ఎగుమతియ్యేవి.. దిగుమతయ్యేవి!
- అమెరికా ట్రేడ్ డీల్‌తో భారత ఎగుమతులకు జోష్
- యూఎస్ నుంచీ భారీగా రానున్న దిగుమతులు
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడానికి అంగీకరించాయి. మార్చి నెలలో ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి కీలక వివరాలు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఏ ఉత్పత్తులు ఎక్కువ ఎగుమతయ్యే అవకాశాలున్నాయి? ఏ ఉత్పత్తులు అమెరికా నుంచి మన దేశానికి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలున్నాయో చూద్దాం.
కార్మికశక్తి అధికంగా ఉన్న రంగాలకు జోష్
ఈ ట్రేడ్ డీల్‌తో 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ భారత ఎగుమతులకు అందిరానుంది. ఇది ఎంఎస్ఎంఈ, రైతులు, మత్స్యకారులకు కలిసివస్తుందని కేంద్రమంత్రి గోయల్ వెల్లడించారు. కార్మికశక్తి ఎక్కువ ఆధారపడే రంగాల వారీగా ట్రేడ్ డీల్ ప్రభావాన్ని చూస్తే.. టెక్స్‌టైల్, లెదర్, జెమ్స్, జువెల్లరీ, ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, ఆటోమొబైల్స్ వంటి రంగాల ఎగుమతులు అమెరికాకు పెరగనున్నాయి. ఇందులో లెదర్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్స్, అప్పారెల్, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, ఇంటి అలంకరణ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, హస్త కళాకారుల ఉత్పత్తులు అమెరికాలో చౌకగా అందుబాటులో ఉండే అవకాశమున్నది.
వీటిపై అమెరికా టారిఫ్‌లు సున్నా
జనరిక్ ఫార్మా: మన దేశంలో జనరిక్ ఫార్మా భారీస్థాయిలో ఉత్పత్తి చేసే ఔషధాలకు అమెరికా ప్రధాన మార్కెట్. కాబట్టి, జనరిక్ మెడిసిన్స్‌పై అమెరికా టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడం మనకు కలిసివచ్చే అంశం. భారత జనరిక్ ఫార్మారంగానికి గొప్ప అవకాశం. ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్: మన దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ వేగమందుకుంది. ఇది తాజా డీల్‌తో మరింత అభివృద్ధి చెందనుంది. జెమ్స్, డైమండ్స్, జువెల్లరీలపైనా టారిఫ్‌లు సున్నాకు దిగిరావడంతో కార్మిక శక్తికి కలిసిరానుంది.
తగ్గిన టారిఫ్‌లతో దన్ను
1. టెక్స్‌టైల్స్, అప్పారెల్
2. లెదర్, ఫుట్‌వేర్
3. ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు
4. కొన్నిరకాల మెషినరీలు
5. ఆర్గానిక్ కెమికల్స్
6. ఇంటి అలంకరణ ఉత్పత్తులు
7. హస్తకళాకారుల ఉత్పత్తులు
సాగు రంగానికి రక్షణ
వరి, రాగులు, గోధుమలు, ఎండు కొబ్బరి, మొక్కజొన్నలు, బార్లీ, ఓట్స్, జొన్న, మైదా, పాలిష్ చేయిన ధాన్యాలు, పిండి(గోధుమ, మొక్కజొన్న, బియ్యం, బాజ్రా)లకు రక్షణ ఉన్నది. బంగాళాదుంప, ఉల్లి, వెల్లుల్లి, ముష్రుమ్స్, పొట్లకాయ, క్యాప్సికం, బెండకాయలు, బఠానీ, బీన్స్, ఫ్లేక్స్, కాబూలీ చనా, స్వీట్ పొటాటో, కీర దోసలపై ట్రేడ్ డీల్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, ఈ డీల్‌తో సీఫుడ్స్ మన దేశం నుంచి భారీగా అమెరికాకు ఎగుమతి కానున్నాయి.
ఈ ఫలాలు సేఫ్
ఆరెంజ్‌లు ( Orange ), నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, బనానా, మామిడి ( MAngo), ప్రిజర్వ్‌డ్ చెర్రీలు, ఖర్జూరం, డ్రైడ్ యాపిల్, చింతపండు, వాటర్ చెస్ట్‌నట్ కెర్నెల్ సహా మరికొన్ని డ్రైఫ్రూట్లకు ఈ డీల్ నుంచి రక్షణ ఉన్నది. అంటే.. అమెరికా నుంచి ఈ ఫలాలు మనకు దిగుమతి అవ్వవు. ఇవన్నీ మన దేశ రైతులను రక్షణ తీసుకున్న నిర్ణయాలని కేంద్రం తెలిపింది. దీంతో రైతుల నుంచి రక రకాల కామెంట్స్ వస్తున్నాయి.






