- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror Attack : భారత్ కఠిన నిర్ణయాలు.. పాక్ షేర్ మార్కెట్లు కుదేలు
పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో భారత్ పాక్ పట్ల పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో భారత్ పాక్ పట్ల పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. 48 గంటల్లో పాక్ పౌరులు, పర్యాటకులు భారత్ ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగా నేడు పాకిస్థాన్ వీసాలు అన్నిటినీ రద్దు(Pakistan Visa Cancle) చేసింది. ఇక వారంతా తక్షణమే తన దేశం వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది., అయితే మెడికల్ వీసాదారులు మాత్రం ఈనెల 29 లోపు భారత్ వీడాలని స్పష్టం చేసింది. భారత్ లో ఉన్న పాక్ హైకమిషనర్ ను కూడా వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అలాగే భారత్ పాక్ మధ్య రాకపోకలు కొనసాగించే అటారి బోర్డర్ చెక్ పోస్టును మూసివేసింది.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. అయితే భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలతో పాక్ షేర్ మార్కెట్లు కుప్పకూలాయి(Pak Share Markets Down). పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 2 శాతం పతనం అయ్యాయి. దీంతో గురువారం పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్‌సైట్ మూసివేశారు. కాగా ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకు చేరగా.. ఈ దెబ్బతో పాక్ ఎకానమీ పాతాళానికి పడిపోవడం ఖాయం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయాలపై పాకిస్తాన్ కూడా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.






