- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా, భారత్ ఉద్రిక్తతల తగ్గింపునకు.. నాలుగు దశల ప్రణాళిక
చైనాలోని కింగ్ డావోలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) మీటింగ్ లో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించడానికి చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి నాలుగు దశల ప్రణాళికను కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని కింగ్ డావోలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) మీటింగ్ లో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి, సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించడానికి నాలుగు దశల ప్రణాళికను కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. 2024 విభజన ప్రణాళికకు కట్టుబడి ఉండటం, తీవ్రతను తగ్గించడానికి నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల విభజన లక్ష్యాన్నిసాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడం, విభేదాలు తగ్గించుకుని సంబంధాలు మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రతినిధి స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ ఉగ్రవాదం విషయాన్ని కూడా లేవనెత్తారు. ఆపరేషన్ సిందూర్ గురించి తెలియజేశారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ లో స్పందించారు. చైనాతో జరిగిన మీటింగ్ సానుకూల దృక్పథంతో సాగిందన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు.
(SCO) డాక్యుమెంటేషన్ పై సంతకం చేయని రాజ్ నాథ్ సింగ్
బిహార్ నుంచి తెచ్చిన మధుబని పెయింటింగ్‌ను అడ్మిరల్ డాంగ్ జున్ కు రాజ్ నాథ్ అందజేశారు. బీజింగ్ తో భారత్ ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. షాంఘై సహకార సంస్థ (SCO)కు అధ్యక్షత వహిస్తున్న చైనా, దాని మిత్రదేశమైన పాకిస్తాన్ కలిసి SCO పత్రంలో పహల్గాం ఉగ్రవాద ఘటన అంశాన్ని తప్పించేందుకు ప్రయత్నించాయి. ఏప్రిల్ 22 దాడిని ప్రస్తావించకుండా దారి మళ్లించాయి. కానీ అదే సమయంలో బలూచిస్తాన్ గురించి ప్రస్తావించాయి. బలూచిస్తాన్ లో అస్థిరతకు భారత్ కారణమని చెప్పేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఉగ్రవాదంపై తక్కువ చేసి చూపడంతో (SCO) డాక్యుమెంటేషన్ పై రాజ్ నాథ్ సింగ్ సంతకం చేయలేదు. అయినప్పటికీ చైనా రక్షణ మంత్రితో మీటింగ్ సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. 2020 గల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం చైనా, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలను నెలకొన్నాయి. భారతదేశం-చైనా సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలి. పునరుద్ధరించబడిన దౌత్య సంబంధాలను అభివృద్ధి చేయాలని ఇరుదేశాలు పిలుపునిచ్చాయి.






