- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై భారత్ ముందుకే..
జమ్మూకశ్మీర్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. సింధు నది జలాల నీటి ఒప్పందం కారణంగా ఇన్నాళ్లు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం చాలా కష్టంగా మారిందని ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వలను పెంచుకునే అవకాశం ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం పాక్ తో సింధు జలాల నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం రోజుకో ముందడుగు వేస్తుంది. భారత్ నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం వల్ల భారత్ కు అనేక లాభాలు ఉండగా.. పాక్ కు నీటి కష్టాలు తప్పేలా లేవు.
మరో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు
ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూకశ్మీర్‌లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఆమోదించగా.. వాటి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. సింధు నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు, చీనాబ్‌పై కిర్తాయ్-2, సవల్‌కోట్, జీలంపై ఉరి-1,2 ప్రాజెక్టులు రెడీ కానున్నాయి. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ సింధు నది నీటి జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం.. సింధు ఉప నదుల్లో రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు ఉన్నాయి. పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి.






