- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత టెక్నికల్ ఎక్స్ పర్ట్ కు అమెరికాలో అరుదైన గౌరవం
భారత్ కు చెందిన టెక్నికల్ ఎక్స్ పర్ట్ సంజోయ్ పాల్ కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ కు చెందిన టెక్నికల్ ఎక్స్ పర్ట్ సంజోయ్ పాల్ కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అక్కడ విద్యారంగంలో ఆవిష్కర్తలకు ఇచ్చే అత్యున్నతమైన నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్వెంటర్స్ (NAI) లిస్టులో ఆయనకు స్థానం దక్కిందది. ఈ లిస్టును అకాడమీ ఇటీవలే ప్రకటించింది. 2025 సంవత్సరానికి 169 మంది దీనికి ఎంపికవ్వగా అందులో పాల్ కూడా ఉన్నారు. కాగా.. పాల్ ప్రస్తుతం రైస్ నెక్సస్ ఇన్నోవేషన్ హబ్, ఏఐ హ్యూస్టన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, రైస్ యూనివర్సిటీ టెక్నాలజీ డెవలప్మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన బెల్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి సంస్థల్లో సీనియర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించరు.
ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి డిగ్రీ పొందిన పాల్.. ఇప్పటి వరకూ అనేక అవార్డులు అందుకున్నారు. వాటిలో థామస్ ఆల్వా ఎడిసన్ పేటెంట్ అవార్డు, విలియం ఆర్. బెన్నెట్ అవార్డు, ఇన్ఫోసిస్ ఎక్సలెంట్ అవార్డు, ఎంఐటీ టెక్నాలజీ రివ్యూస్, గ్రాండ్ ఛాలెంజెస్ ఫర్ ఇండియా అవార్డులు ఉన్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (IEEE) డిపార్ట్మెంట్లో ఆయన 95 పేటెంట్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.






