- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్.. క్వీన్స్‌లాండ్‌లో 24 గంటల్లో 5 లక్షల మెరుపులు
ఈ రోజు క్వీన్స్‌ల్యాండ్ వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో T20 మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందే అక్కడ విచిత్ర వాతావరణం కనిపించింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు క్వీన్స్‌ల్యాండ్ వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో T20 మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందే అక్కడ విచిత్ర వాతావరణం (Strange weather) కనిపించింది. తీవ్రమైన ప్రతికూలత తో కూడిన భారీ వడగళ్ల వాన, పిడుగులు (thunderbolts), గాలివానలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు బీభత్సాన్ని చూశాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 5 లక్షల మెరుపులు (Lightning) పడినట్లు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం (Bureau of Meteorology) స్పష్టం చేసింది. అలాగే స్థానిక వార్తల ప్రకారం.. క్వీన్స్‌ల్యాండ్ దక్షిణ భాగంలో పడ్డ వడగళ్లు సుమారు 9 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండటం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అనేక ఇళ్ల పైకప్పులు, వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. కానీ ఈ రోజు మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి వాతావరణం శాంతించిడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మ్యాచ్ ప్రారంభం అయింది.






