- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవంబర్ లో.. 'ట్రంప్' వివాదాస్పద బయోపిక్ రిలీజ్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం 'ది అప్రెంటిస్'. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం 'ది అప్రెంటిస్'. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే అమెరికాలో జరగబోతున్న ఎన్నికలకు ముందుగానే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ చిత్రం.. తన పూర్తి ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందని గతంలో ట్రంప్ దీనిని వ్యతిరేకించారు. కాగా గార్బియోల్ షెర్మాన్ రచించిన ఈ చిత్రం, ట్రంప్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. దీనికి అలీ అబ్బాసీ దర్శకత్వం వహించారు. ట్రంప్ 1970 నుంచి 1980 ల మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగి, తదనంతరం రాజకీయ నాయకుడిగా ఎలా రాణించారు తదితర విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది మే 20 న జరిగిన 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ గా ఈ మూవీని ప్రదర్శించారు.కాగా ఈ సినిమాలో డొనాల్డ్ ట్రంప్ గా.. సెబాస్టియన్ స్టాన్ నటించాడు.






