హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్! సైనిక కస్టడీకి ఇవ్వొద్దని వినతి

by Geesa Chandu |   (  Updated:2024-09-03 12:31:57  IST  )

గత ఏడాది మే 9 వ తేదీన.. పాకిస్థాన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై, సైనిక విచారణకు అవకాశం ఉందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్! సైనిక కస్టడీకి ఇవ్వొద్దని వినతి
X

దిశ, వెబ్ డెస్క్: గత ఏడాది మే 9 వ తేదీన.. పాకిస్థాన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై, సైనిక విచారణకు అవకాశం ఉందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనను సైనిక కస్టడీకి ఇవ్వొద్దని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అవినీతి కేసుకు సంబంధించి.. పాకిస్థాన్ లో గత ఏడాది మే 9 న, 71 ఏళ్ల పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పారామిలిటరీ రెంజర్లు అరెస్ట్ చేసిన తర్వాత హింసాత్మక నిరసనలు జరిగాయి. దీంతో ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు మియాన్ వాలి ఎయిర్ బేస్, జిన్నా హౌస్ మరియు ఫైసలాబాద్ లోని ISI భవనంతో పాటు 12 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెల్సిందే. ఇంకా రావల్పిండి లో ఉన్నటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో పాకిస్థాన్ రక్షణ మంత్రి, ఇమ్రాన్ ఖాన్ ను సైనిక విచారణకు పిలవనున్నట్లు తెలపడంతో.. ఇమ్రాన్ ఖాన్ ముందస్తుగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Next Story