- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి.. ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (71).. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (71).. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఆదివారం రాత్రి గడువుకన్నా ముందే దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు. దీని కోసం ఇమ్రాన్ అందరి మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదే యూనివర్సిటీ లో చదివిన విద్యార్థులు మాత్రమే.. ఆ పదవిని ఆన్లైన్ లో అప్లై చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో అదే యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన ఇమ్రాన్ ఖాన్, ఛాన్సలర్ పదవికి అప్లై చేసుకున్నారు. దీనిని పాక్ మీడియా కూడా ధృవీకరించింది. అయితే ఛాన్సలర్ పదవికి ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఛాన్సలర్ పదవికి ఓల్డ్ స్టూడెంట్స్, ఉద్యోగులు పోటీ చేయవచ్చు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ ఫర్డ్ లో 1970 లో తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్ధిక శాస్త్ర విభాగం నుంచి తన పట్టాను అందుకున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కు గతంలో బ్రాడ్ ఫోర్డ్ యూనివర్సిటీకి 8 ఏళ్లు.. ఛాన్సలర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.






