Mark Zuckerberg : నాకు ఉరిశిక్ష పడటం ఖాయం : మార్క్ జుకర్ బర్గ్

by Muthe.Rajitha |

ఎవరో చేసిన పనులకు తాను శిక్ష అనుభవించాల్సి రావొచ్చు అని మెటా(Meta) సీఈవో మార్క్ జుకర్ బర్గ్(Mark Zuckerberg) పేర్కొన్నారు.

Mark Zuckerberg : నాకు ఉరిశిక్ష పడటం ఖాయం : మార్క్ జుకర్ బర్గ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎవరో చేసిన పనులకు తాను శిక్ష అనుభవించాల్సి రావొచ్చు అని మెటా(Meta) సీఈవో మార్క్ జుకర్ బర్గ్(Mark Zuckerberg) పేర్కొన్నారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆయన.. పాకిస్థాన్(Pakistan) లో తనకి మరణ శిక్ష విధించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరో ఫేస్ బుక్(Face Book) లో పోస్టులు పెడితే తనను శిక్షించాలని కోర్టులో కేసులు వేశారని వెల్లడించారు. పాక్ లో దేవుడిని అవమానిస్తూ ఉన్న చిత్రాలను పోస్ట్ చేస్తే తన సంస్థపై కేసులు పెట్టడం దారుణం అన్నారు. అనేక దేశాల్లో ప్రపంచం అంగీకరించని చాలా చట్టాలు ఉన్నాయని వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదన్నారు. పాక్ లో కేసు గొడవ ఎక్కడికి వెళుతుందో తెలియదని, కాని తాను ఆ దేశానికి వెళ్ళను కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై అనేక దేశాల్లో కఠిన నిబంధనలు ఉండటం వలన ఎఫ్బీ లో చాలా కంటెంట్ మీద రెస్ట్రిక్షన్స్ విధించాల్సి వస్తోంది అన్నారు. విదేశాలలో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలకు రక్షణ కల్పించడానికి అమెరికా సాయం అందించాలని, దీనిపై ట్రంప్ కఠిన నిబంధనలు తీసుకునేలా చట్టాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ కోరారు. కాగా 2024 ప్రారంభంలో తమ దేశ భద్రతా కారణాల దృష్ట్యా మెటాపై పాక్ నిషేధం విధించింది. బలూచిస్తాన్ ఉగ్రవాదులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మెటాను ఉపయోగిస్తున్నారని పాక్ ఆరోపించింది.

Next Story