ఆరు నెలలు రేప్ చేశారు.. సంతలో అమ్మేశారు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-18 17:24:24  IST  )

ఎఖ్లాస్.. 2014 యెజిడీ జెనోసైడ్ సమయంలో జరిగిన దారుణమైన అన్యాయాలకు సంబంధించిన హృదయవిదారక సంఘటనకు ఒక ఉదాహరణ. ఐసిస్ యెజిడీ గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకొని.. వేలాది మంది మహిళలు, బాలికలను అపహరించింది. భయంకరమైన లైంగిక హింసకు గురిచేసింది

ఆరు నెలలు రేప్ చేశారు.. సంతలో అమ్మేశారు..
X

వెబ్ డెస్క్: ఎఖ్లాస్.. 2014 యెజిడీ జెనోసైడ్ సమయంలో జరిగిన దారుణమైన అన్యాయాలకు సంబంధించిన హృదయవిదారక సంఘటనకు ఒక ఉదాహరణ. ఐసిస్ యెజిడీ గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకొని.. వేలాది మంది మహిళలు, బాలికలను అపహరించింది. భయంకరమైన లైంగిక హింసకు గురిచేసింది. బానిసలుగా చేసి విక్రయించింది. ఐక్య రాజ్య సమితి 2016 నివేదిక వంటి మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం.. బాలికలను సంతలో అమ్మినట్లు అమ్మేశారు. వారి హీనస్థితి కారణంగా ఎక్కువ ధరకు విక్రయించబడ్డారు.

ఈ దారుణమైన హింస ఈ ప్రాంతంలో సైన్యం లేని గ్రూప్స్.. యెజిడీల వంటి వారు ఎదుర్కొనే తీవ్రమైన వేదనలను ప్రతిబింబిస్తుంది. సంఘటిత రక్షణ లేకపోవడం వల్ల భయంకర పరిస్థితులకు గురయ్యారు. సుమారు 5000 మంది యెజిడీ మహిళలు, పిల్లలు బానిసలుగా మారారు. చాలామంది ఇప్పటికీ కనిపించకుండా ఉన్నారు. ఈ టార్చర్ నుంచి బయటపడ్డ ఎఖ్లాస్ తన పరిస్థితి ఎలా ఉండేదో మీడియాకు వివరించింది. దాదాపు ఆరు నెలలు తనను రేప్ చేశారని.. సెక్స్ స్లేవ్‌గా మార్చేసి ఒక్కో రోజు ఒక్కో విధంగా హింసించారని తెలిపింది. తనను ఎంచుకున్న వ్యక్తి బీస్ట్ మాదిరిగా ఉన్నాడని.. దారుణమైన దుర్వాసనతో దుర్మార్గుడిగా ఉన్నాడని చెప్పింది. అతన్ని చూసేందుకు కూడా భయమేసిందన్న ఆమె.. ఆ బాధ భరించలేక చచ్చిపోదామని అనుకున్నానని.. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయని తెలిపింది. అయితే సదరు వ్యక్తి యుద్ధానికి వెళ్లినప్పుడు .. తను తప్పించుకోగా.. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న ఆమె.. ఎడ్యుకేషన్, థెరపీ అందుకుంటుంది. లాయర్ కావాలని కోరుకుంటుంది.

VIDEO

Next Story