కేరళ ఉపఎన్నికల ప్రచారానికి నన్ను పిలవలేదు:శశిథరూర్

by Shamantha N |

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని నిలంబూర్ ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నన్ను ఆహ్వానించలేదని పేర్కొనడంతో అంతర్గతంగా ఉన్న విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి.

కేరళ ఉపఎన్నికల ప్రచారానికి నన్ను పిలవలేదు:శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని నిలంబూర్ ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ తనను ఆహ్వానించలేదని పేర్కొనడంతో అంతర్గతంగా ఉన్న విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. దీనిపై కేరళ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ స్పందించారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం సెలబ్రెటీల లిస్టు అధికారికంగా ప్రచురించాం. అందులో శశిథరూర్ పేరు కూడా ఉంది. కానీ ఆయన ఎక్కువగా విదేశాల్లో, ఢిల్లీలో ఉంటున్నారు. కేరళకు వస్తున్నారో లేదో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రచారానికి పిలిచిన అందరూ పాల్గొన్నారని సన్నీ జోసెఫ్ తెలిపారు.

ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు

శశి థరూర్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ నాకు పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేదని ఆయన తెలిపారు. కనీసం ప్రచారానికి రావాలని ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. పార్టీలో విభేదాలున్నాయని స్వయంగా అంగీకరించినప్పటికీ, వాటిని తక్కువ చేసి చూపేందుకు ఆయన ప్రయత్నించారు. ఆయన ఇటీవల ఐదు దేశాల అధికారిక పర్యటనలో పాల్గొన్నారు. యూఎస్ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగడడం, గత యుపీఏ పాలనలో జరిగిన దాడులను ప్రస్తావించడంతో వివాదం ముదిరింది.

Next Story