- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు.. మండిపడుతున్న నెటిజన్లు
భార్యకు బట్టతల వచ్చిందని, ఆమెను మానసికంగా వేధించి ఆఖరికి విడాకులిచ్చి వదిలించుకున్నాడో భర్త. కనీసం బిడ్డను తన వద్ద ఉంచేందుకు కూడా కోర్టు అనుమతించకపోవడంతో.. ఆ భార్య వేదన వర్ణనాతీతంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: బట్టతల ఉన్న అబ్బాయిలకు పెళ్లిళ్లవడం చాలా కష్టమని మనకి తెలుసు. మరి బట్టతల ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? భార్యకు బట్టతల వచ్చిందని, ఆమెను మానసికంగా వేధించి ఆఖరికి విడాకులిచ్చి వదిలించుకున్నాడో భర్త. కనీసం బిడ్డను తన వద్ద ఉంచేందుకు కూడా కోర్టు అనుమతించకపోవడంతో.. ఆ భార్య వేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ దారుణ ఘటన చైనాలో వెలుగుచూసింది.
అక్కడి మీడియాలో వెల్లడైన వివరాల ప్రకారం.. హెనాన్ ప్రావిన్సుకు చెందిన లీ (36) అనే మహిళకు పదహారేళ్ల క్రితం వివాహమయింది. అప్పటి నుంచి భర్త, పిల్లలు, కుటుంబమే ఆమె ప్రపంచం. వారికోసమే కష్టపడింది. రెండేళ్ల క్రితం విటిలిగో అన్ దీర్ఘకాలిక చర్మవ్యాధి సోకడంతో.. జుట్టు తెల్లబడి ఊడిపోయి.. బట్టతల వచ్చింది. జబ్బుతో బాధపడుతున్న భార్యకు ధైర్యం చెప్పి.. ట్రీట్మెంట్ చేయించాల్సిన భర్త.. ఆమెను అసహ్యించుకున్నాడు. ఆమె ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు సరికదా.. ఆస్పత్రికి తీసుకెళ్లడం మాట అటుంచితే.. ట్రీట్మెంట్ కు కూడా సపోర్ట్ చేయలేదు. అలా జుట్టులేకుండా ఉండటం వల్ల బంధువులు, స్నేహితుల్లో తన పరువు పోతుందని ఫంక్షన్లకు కూడా తీసుకెళ్లడం మానేశాడు. ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించడం, అందుకయ్యే ఖర్చును తాను భరించడం ఇష్టంలేని భర్త.. మాటలు, చేతలతో మానసిక వేదనకు గురిచేశాడు.
భర్త నిర్లక్ష్యం.. ఏదొక విషయంలో గొడవలతో కుంగిపోవడంతో ఆమె వ్యాధి మరింత ఎక్కువైనట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె భర్త విడాకులు కావాలని కోరడంతో అంగీకరించక తప్పని పరిస్థితి ఆమెది. కోర్టు బిడ్డ కస్టడీని కూడా తండ్రికి అప్పగించడంతో ఆమె ఒంటరైంది. అతనిలాంటి Cruel Heart వ్యక్తిని ఎప్పుడూ చూడలేదంటూ కన్నీరు పెట్టుకుంది. ఇదంతా ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. నెటిజన్లు ఆ భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






