corona cases increase: దేశంలో వారం వ్యవధిలో భారీగా కరోనా కేసుల పెరుగుదల

by Shamantha N |

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. జూన్ 1 (శనివారం) నాటికి దేశంలో 3,395 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే 22న కేవలం 257 యాక్టివ్ కేసులుండగా, మే 26 నాటికి అవి 1,010కి పెరిగాయి. అంటే ఒక్క వారం వ్యవధిలో కేసుల సంఖ్యలో 1,200 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.

corona cases  increase: దేశంలో వారం వ్యవధిలో భారీగా కరోనా కేసుల పెరుగుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. జూన్ 1 (శనివారం) నాటికి దేశంలో 3,395 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే 22న కేవలం 257 యాక్టివ్ కేసులుండగా, మే 26 నాటికి అవి 1,010కి పెరిగాయి. అంటే ఒక్క వారం వ్యవధిలో కేసుల సంఖ్యలో 1,200 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది. దీంతో జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాతి మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు అత్యంత ప్రభావితం అవుతున్నాయి.

కొత్త కేసులు పెరిగిన ప్రాంతాలు ఇవే..

కేరళ 189 కొత్త కేసులు, మొత్తం యాక్టివ్ కేసులు – 1,336 ఉన్నాయి. మహారాష్ట్ర 467, ఢిల్లీ 375, గుజరాత్ 265, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్ 205, తమిళనాడు 185, ఉత్తరప్రదేశ్ 117, రాజస్థాన్ (60), పుదుచ్చేరి (41), హర్యానా (26), ఆంధ్రప్రదేశ్ (17), మధ్యప్రదేశ్ (16) లలోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం మధ్యలో దేశవ్యాప్తంగా 685 కొత్త కేసులు నమోదు కాగా, నాలుగు మరణాలు సంభవించాయి. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 26 మంది కరోనా వల్ల మరణించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపిన ప్రకారం.. వెస్ట్, సౌత్ ఇండియాలో సేకరించిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఒమిక్రాన్ ఉప-వేరియంట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమైన వాటిలో ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్.వన్, ఎన్ బీ.వన్.బి.వన్ ఎక్కువగా వ్యాపిస్తున్న వేరియంట్లుగా గుర్తించారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండమని, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తోంది.

Next Story