- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటన.. 128కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్ లోని 8 టవర్లలో బుధవారం (నవంబర్ 26) జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హాంకాంగ్ లోని 8 టవర్లలో బుధవారం (నవంబర్ 26) జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకూ 128 మంది మరణించినట్లు అక్కడి అధికారులు శుక్రవారం ప్రకటించారు. ప్రమాదం తర్వాత 200 మంది కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదన్నారు. భవనాల్లో మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది.. ఒక్కో ఫ్లాట్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక భవనంలో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనున్న టవర్లకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 1000 మంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని కీలలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు 24 గంటల సమయం పట్టగా.. నేటికీ కొన్ని ఫ్లాట్స్ నుంచి పొగలు వస్తున్నట్లు చెప్తున్నారు. భవనాల నిర్మాణంలో కిటికీల వద్ద ఏర్పాటు చేసిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పాలిస్టరైన్ అనేది పెట్రోలియం బేస్డ్ ప్లాస్టిక్. మరమ్మతుల కోసం పెట్టిన వెదురు బొంగులు, నిర్మాణ మెష్ కూడా వీటికి కారణమై ఉండొచ్చంటున్నారు. ఈ కాంప్లెక్స్ ను 1983లో నిర్మించగా.. 8 టవర్లు ఉన్నాయి. ఒక్కో టవర్లో 31 అంతస్తులు ఉండగా ..1984 ఫ్లాట్లలో 4600 మంది నివాసం ఉంటున్నారు.






