మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. విచారం వ్యక్తం చేసిన హై కమిషన్

by Malleboina Mahesh |

లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సిగ్గుచేటు చర్యను హైకమిషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తీవ్రంగా ఖండించింది.

మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. విచారం వ్యక్తం చేసిన హై కమిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue) ధ్వంసం చేసిన సిగ్గుచేటు చర్యను లండన్ లోని భారత హైకమిషన్ (Indian High Commission) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తక్షణ చర్య కోసం స్థానిక అధికారులతో హైకమిషన్ ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించింది. అలాగే ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదని అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి మూడు రోజుల ముందు అహింసా ఆలోచనపై, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా పేర్కొంది. ఈ దాడిపై వారి బృందం ఇప్పటికే స్థలంలో విగ్రహాన్ని దాని అసలు గౌరవానికి పునరుద్ధరించడానికి అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.

” అని లండన్‌లోని భారత హైకమిషన్ పేర్కొంది. అలాగే తక్షణ చర్య కోసం స్థానిక అధికారులతో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించింది. విగ్రహాన్ని దాని అసలు గౌరవానికి పునరుద్ధరించడానికి అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. కాగా ఈ విగ్రహాన్ని 1968లో లండన్‌లో ప్రతిష్టాపించారు. ఈ విగ్రహం కళాకారిణి ఫ్రెడా బ్రిలియంట్ సృష్టి కాగా.. గాంధీ విద్యార్థి దశలో చదువుకున్న యూనివర్సిటీ కాలేజ్ సమీపంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Next Story