- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయిల్ పై 20 రాకెట్లతో విరుచుకుపడ్డ హెజ్బొల్లా.. ఒకరి మృతి
by Geesa Chandu |
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయిల్ పై హెజ్బొల్లా 50 రాకెట్లతో దాడికి దిగింది. ఈ దాడితో రాకెట్లు గోలన్ హైట్స్ ను తాకినట్లు సమాచారం. దీంతో పలు ప్రైవేట్ ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయిల్ జరిపిన దాడికి ప్రతీకారంగానే.. బుధవారం దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ల దాడిలో ఒకరు మృతి చెందగా, మరో 19 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా గత 10 నెలలుగా.. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగానే ఇజ్రాయిల్, హెజ్బొల్లా మధ్య తరచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయిల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ ఈ రాకెట్ల దాడి చోటుచేసుకోవడం గమనార్హం.
Next Story






