అహ్మదాబాద్‌లో పెను ప్రమాదం.. నాలుగు ఎయిర్ పోర్టుల్లో హెల్ప్ లైన్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 04:13:10  IST  )

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన నేపథ్యంలో నాలుగు ఎయిర్ పోర్టులో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు...

అహ్మదాబాద్‌లో పెను ప్రమాదం.. నాలుగు ఎయిర్ పోర్టుల్లో హెల్ప్ లైన్స్
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో(Ahmedabad) ఘోర విమాన ప్రమాదం(Flight Accident) జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో మృతుల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. తమ వాళ్ల మృతదేహాలను అప్పగించాలని కోరుతున్నారు. అయితే డీఎన్ఏ ఆపరేషన్(DNA Operation) తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు, బంధువులు గురువారం నుంచి తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు ఫైట్‌లో లండన్ బయల్దేరిన వివరాలు, ఆనవాళ్లు తెలపాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల పూర్తి సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, గాట్విక్‌‌ ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేసిన ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800 5691 444కు సంప్రదించాలని కోరారు.

Next Story