- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srilanka: శ్రీలంకలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు సైనికులు మృతి
శ్రీలంకలో (Srilanka) ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంకలో (Srilanka) ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మడురు ఓయా అనే సెంట్రల్ ప్రాంతంలో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్ దళానికి చెందిన బెల్ 212 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేడ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రదర్శనకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు పేర్కొంది. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్, నలుగురు ప్రత్యేక దళ సైనికాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు 9 మంది సభ్యులతో శ్రీలంక వైమానిక దళం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
Next Story






