సోషల్ మీడియాలో ‘హేట్ స్పీచ్ ’ ఇక నాన్ బెయిలబుల్ కేసులే

by Shamantha N |

కర్ణాటక రాష్ట్ర సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ పాంలలో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్లు జైలు శిక్షరూ. 5 వేలు ఫైన్ విధించే చట్టం తీసుకురానుంది.

సోషల్ మీడియాలో ‘హేట్ స్పీచ్ ’ ఇక నాన్ బెయిలబుల్ కేసులే
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్ర సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ పాంలలో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్లు జైలు శిక్షరూ. 5 వేలు ఫైన్ విధించే చట్టం తీసుకురానుంది. కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ (నిరోధం, నియంత్రణ) బిల్లు 2025 పేరిట రూపొందించిన ముసాయిదా చట్టం కీలక నిబంధనలను కలిగి ఉంది. ఇందులో డిజిటల్ మాధ్యమాలపై కట్టుదిట్టమైన నియంత్రణతో పాటు, జిల్లా స్థాయి అధికారులకు వాటిని నిరోధించే హక్కులను కల్పించారు. ఈ బిల్లులో ద్వేష ప్రసంగాలకు బెయిల్ లేని, నాన్ కాగ్నిజబుల్ నేరాలుగా ప్రకటించారు. నేరస్థులు అని తేలితే వారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధించనున్నారు.

డిజిటల్ ప్లాట్ పాంలపై కఠిన నిబంధనలు

సోషల్ మీడియా సంస్థలు, సెర్చ్ ఇంజిన్లు, టెలికం కంపెనీలు, ఆన్‌లైన్ మార్కెట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వేదికలపై విద్వేష పూరిత కంటెంట్ ని ప్రసారం చేసినట్లైతే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. హేట్ స్పీచ్ లేదా హేట్ క్రైమ్స్‌కు ఆర్థిక సాయం, ఇతర సహాయం చేసిన వారిని కూడా ప్రధాన నేరస్తుల్లా శిక్షించనున్నట్లు ముసాయిదా బిల్లు పేర్కొంది. మత సంబంధిత ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలున్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు ర్యాలీలు, సభలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం వంటి కార్యకలాపాలను 30 రోజుల పాటు నిషేధించగలిగే అధికారం పొందనున్నారు. అవసరమైతే ఈ ఆదేశాలను 60 రోజులకు పొడిగించవచ్చు. భావ ప్రకటనా స్వేచ్చను ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ పొందవచ్చని బిల్లులో పేర్కొన్నారు.

ప్రజల అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు

చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కలిగించే ప్రచారాలు నిర్వహించాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బాధ్యతలు మానవ హక్కుల సంఘం లేదా మహిళా కమిషన్ వంటి సంస్థలకు అప్పగించవచ్చు. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణతో పాటు, చట్ట అమలుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఈ చట్టం అమలయితే విద్వేషాలను వ్యాప్తి చేసే విషయంలో డిజిటల్ మీడియాను కర్ణాటక ప్రభుత్వం కట్టడి చేసే అవకాశం కనిపిస్తోంది.

Next Story