పాకిస్థాన్ ఇజ్రాయిల్ పై అణ్వస్త్ర దాడి చేయడానికి ఒప్పుకుందా?

by Shamantha N |

ఇజ్రాయిల్ ఇరాన్ పై అణ్వస్త్ర దాడి చేస్తే తమ దేశానికి అనుకూలంగా పాకిస్థాన్ కూడా ఇజ్రాయిల్ పై న్యూక్లియర్ దాడి చేసేందుకు హామీ ఇచ్చిందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ మొహస్న్ రెజాయ్ ఇరాన్ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

పాకిస్థాన్ ఇజ్రాయిల్ పై అణ్వస్త్ర దాడి చేయడానికి ఒప్పుకుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ ఇరాన్ పై అణ్వస్త్ర దాడి చేస్తే తమ దేశానికి అనుకూలంగా పాకిస్థాన్ కూడా ఇజ్రాయిల్ పై న్యూక్లియర్ దాడి చేసేందుకు హామీ ఇచ్చిందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ మొహస్న్ రెజాయ్ ఇరాన్ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఈ వివాదాస్పద ప్రకటన నేపథ్యంలో దీనిపై పాకిస్థాన్ గానీ పాకిస్థాన్ సంబంధిత అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడ గమనార్హం. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో ఈ ప్రకటనతో పాకిస్థాన్ పై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్ కు మద్దతుగా నిలుస్తాం: పాకిస్థాన్

జూన్ 13న నుంచి ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రత్యక్షంగా దాడులు చేస్తోంది. అణు సామర్థ్య కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని, కీలక శాస్త్రవేత్తలు సైనిక అధికారులను చంపినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ పై తాము కూడా బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడులు చేసినట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయిల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దాడులు చేస్తుండగా.. ఇరాన్ ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో ప్రతీకార దాడులకు దిగుతోంది. కాగా పాకిస్థాన్ ఇరాన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. యూదు రాజ్యం దురాక్రమణగా వర్ణించింది. ఇస్లామిక్ దేశాలు ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చింది. జూన్ 14న జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ముస్లిం దేశాలు కలిసి రాకపోతే ఇరాన్, పాలస్తీనా మాదిరిగానే అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Next Story