హనుమంతుడు అసలు దేవుడు కాదు.. అమెరికా నేత సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

అమెరికాలోని టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నాయకుడు అలెక్సాండర్ డంకన్ హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదం గా మారాయి.

హనుమంతుడు అసలు దేవుడు కాదు.. అమెరికా నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నాయకుడు అలెక్సాండర్ డంకన్ (Alexander Duncan) హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. కొద్ది నెలల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంలో 90 అడుగుల హనుమాన్ విగ్రహం (Hanuman statue) నిర్మించారు. ఈ విగ్రహం "స్టాట్యూ ఆఫ్ యూనియన్"గా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం 2024 లో ప్రారంభించబడింది, ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన హిందూ విగ్రహం గా గుర్తించబడింది. ఇది భక్తి, సమర్పణ, ఐక్యతను సూచిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ విగ్రహం ప్రారంభం నుంచి వివాదాలకు గురైంది.

తాజాగా, టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నాయకుడు అలెక్సాండర్ డంకన్ స్పందిస్తూ.. "మాది క్రైస్తవ దేశం" అని వ్యాఖ్యానించారు. అలాగే హనుమంతుడు అసలు దేవుడు కాదని (Hanuman is not a God.) ఆయన నోరు పారేసుకున్నాడు. ఆయన టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల కాంస్య హనుమంతుడి విగ్రహం వీడియో ని షేర్ చేస్తూ.. "టెక్సాస్‌లో తప్పుడు హిందూ దేవుడి తప్పుడు విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాం? మనది క్రైస్తవ దేశం!" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF)తీవ్రంగా స్పందించింది. అలాగే హిందూ వ్యతిరేక ద్వేషంగా అభివర్ణించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని HAF డిమాండ్ చేసింది.

Next Story