hamas: రఫాలో అమాయక ప్రజలపై కాల్పులు జరిపింది హమాస్ టెర్రరిస్టులే

by Shamantha N |

రఫాలోని గాజా హ్యుమానిటేరియన్ (humanitarian aid) ఫౌండేషన్ కేంద్రం వద్ద ఆదివారం కాల్పులు జరిపి 28 మందిని చంపింది హమాస్ అని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఒక డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది. తాము కాల్పులు జరపలేదని ఐడీఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

hamas: రఫాలో  అమాయక ప్రజలపై కాల్పులు జరిపింది హమాస్ టెర్రరిస్టులే
X

దిశ, నేషనల్ డెస్క్ : రఫాలోని గాజా హ్యుమానిటేరియన్ (humanitarian aid) ఫౌండేషన్ కేంద్రం వద్ద ఆదివారం కాల్పులు జరిపి 28 మందిని చంపింది హమాస్ అని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఒక డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది. తాము కాల్పులు జరపలేదని ఐడీఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. వీడియోలో స్పష్టం ఒక వ్యక్తి తుపాకి పట్టుకుని విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వేల సంఖ్యలో ఉన్న జనాలపైకి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అక్కడ మానవతా సాయం అందించడంలో ఎలాంటి అవరోధాలు లేవని ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా కాల్పులు జరిగిన ప్రాంతం ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది.

ఆకలితో అల్లాడుతున్న గాజా ప్రజలు

గాజాలోని ప్రజలు తీవ్ర ఆకలితో ఉన్నారు. గాజాలో ఇజ్రాయిల్ భీకరంగా దాడులు చేస్తోంది. దీంతో ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు వారికి ఆహారం, సరకులు సాయం చేస్తున్నాయి. దీనికి ఇజ్రాయిల్ ఈ మధ్యనే ఒప్పుకుంది. కానీ సరకులు తీసుకుంటున్న అమాయక ప్రజల్ని ఇజ్రాయిల్ కాల్చి చంపిందని ఆరోపణలు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ పై విమర్శలు వస్తున్నాయి. విమర్శలకు బదులు ఇస్తూ తాము కాల్పులు జరపలేదని హమాస్ ఉగ్రవాదులే కాల్పులు జరిపి అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారని ఇజ్రాయిల్ చెబుతోంది. కాగా ప్రత్యక్ష సాక్షులు మాత్రం కొంతమంది వ్యక్తులు ప్రజలపైకి కాల్పులు జరపడంతోనే చనిపోయారని తెలుపుతున్నారు.

Next Story