కీలక పరిణామం.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రప్ శాంతి ప్రాణాళికలపై ఇరు ప్రాంతాలు అంగీకరించడంతో.. కాల్పుల విరమణ పై సంతకాలు చేశారు.

కీలక పరిణామం.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం (peace treaty) కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రప్ శాంతి ప్రాణాళికల (Trump peace plan)పై ఇరు ప్రాంతాలు అంగీకరించడంతో.. కాల్పుల విరమణ పై సంతకాలు చేశారు. ఈ శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్–హమాస్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి దశలో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయగా.. మరో దశలో భాగంగా.. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బందీల మార్పిడి కొనసాగుతుంది. రెడ్ క్రాస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఏడుగురు బందీలను తమ కస్టడీలోకి బదిలీ చేసినట్లు ధృవీకరించింది. వీరిని గాజా ప్రాంతంలోని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), ఇజ్రాయెల్ భద్రతా సంస్థ (ISA) అధికారులకు అప్పగించనున్నారు.

ఇదే సమయంలో, మరికొంతమంది బందీలు త్వరలోనే రెడ్ క్రాస్‌కి బదిలీ చేయబడే అవకాశం ఉందని, ఆ బందీలను స్వీకరించడానికి IDF ఇప్పటికే సన్నద్ధమై ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ ప్రకటనలో వెల్లడించాయి. ఈ పరిణామం గాజా పట్టణంలో ఉద్రిక్తతల మధ్య కొంత ఊరట కలిగించినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. హమాస్ చేత బంధించబడిన ఇజ్రాయెలీ పౌరులు, విదేశీయులను విడిపించేందుకు ఇరుపక్షాలు మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. రెడ్ క్రాస్ ఈ ప్రక్రియలో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. బందీల విడుదల, సాయుధ విరమణకు దారితీసే సూచనగా పరిగణించబడుతోంది. తరువాత రెడ్ క్రాస్ కు బదిలీ చేయబడే అవకాశం ఉన్న అదనపు బందీలను స్వీకరించడానికి IDF సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి.

Next Story