- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా అధ్యక్షుడి సన్నిహితుల మెయిళ్లు బయటపెడతాం: హ్యాకర్లు
అమెరికా అధ్యక్షుడి సన్నిహితుల మెయిళ్లను బయటపెడతామని ఇరాన్ హ్యాకర్లు బెదిరింపులకు దిగారు

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడి సన్నిహితుల మెయిళ్లను బయటపెడతామని ఇరాన్ హ్యాకర్లు బెదిరింపులకు దిగారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సలహాదారుడు, న్యాయవాది, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాప్ ల మెయిళ్లు బయటపెడతామని బెదిరించారు. రాబర్ట్ అనే పేరుతో ఓ మీడియా సంస్థతో వారు చాట్ చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 100 గిగాబైట్ల సమాచారం తమ వద్ద ఉందని దాన్ని బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఆ మెయిళ్లలో ఏముంది, కంటెంట్ ఏంటీ అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. ఈ బెదిరింపులపై వైట్ హౌస్ ఎఫ్ బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ స్పందించారు అమెరికా జాతీయ భద్రతకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూఎస్ సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ (CISA) ప్రతినిధి సైబర్ బెదిరింపులపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి కూడా ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. .
గతంలోనే రాబర్ట్ హ్యాకర్లపై ఆరోపణలు
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రాబర్ట్ హ్యాకర్ల గురించి యూఎస్ న్యాయశాఖ ఆరోపణలు చేసింది. ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ దీన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపించింది. అయితే ట్రంప్ అధ్యక్షుడు కాగానే దీన్ని పక్కన పెట్టింది. కాగా ఇరాన్ లోని మూడు అణ్వస్త్ర కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో మళ్లీ రాబర్ట్ హ్యాకర్లు అమెరికాను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రాబర్ట్ హ్యాకర్లు అమెరికాలో అత్యంత ఇంపార్టెంట్ వ్యక్తుల నంచి చోరీ చేసిన మెయిళ్లను అమ్మకానికి పెడుతున్నట్లు తెలుస్తోంది.






