BREAKING: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-09 15:52:45  IST  )

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి.

BREAKING: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. స్టాక్ టన్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకూ ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

స్టాక్ టన్ లోని బంకెట్ హాల్ లో ఓ చిన్నారి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో.. జనాల్లో కలిసిపోయిన వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Click For Twitter Post ....

Next Story