- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Greta Thunberg: ఇజ్రాయెల్ బందీగా ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్
ఇజ్రాయెల్- హమాస్(Israel Gaza Conflicts) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ పరిణామాల మధ్య గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తింది. మానవతా సాయంతో గాజాకు బయల్దేరిన నౌకను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) కమాండోలు చుట్టుముట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్(Israel Gaza Conflicts) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ పరిణామాల మధ్య గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తింది. మానవతా సాయంతో గాజాకు బయల్దేరిన నౌకను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) కమాండోలు చుట్టుముట్టారు. కాగా.. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ ను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నారు. ఆమెతో పాటు మరికొందరు మానవ హక్కుల కార్యకర్తలు ఆ నౌకలో ఉన్నట్లో తెలుస్తోంది. కాగా.. తమను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయంటూ గ్రెటా సోషల్ మీడియాలో వీడియోల రిలీజ్ చేశారు. ఫ్రీడం ఫ్లోటిల్లా సభ్యులతో కలిసి గాజా వెళ్తుండగా తమను అడ్డుకొని బందించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మద్లీన్ అనే నౌకలో..
ఇకపోతే, బ్రిటిష్ జెండాతో ఉన్న మద్లీన్ అనే నౌకలో గ్రెటా సహా పలువురు కార్యకర్తలు గాజాకు బయల్దేరారుGreta Thunberg 'kidnapped' on Gaza flotilla; videos show Israeli forces intercepting Madleen. అయితే, ఆ నౌకలో గ్రెటా థన్‌బర్గ్, మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ రీమా హసన్‌తో పాటు మొత్తం 12 మంది ఉన్నారు. వీరంతా గాజా పౌరుల కోసం ఆహారం, బేబీ ఫార్ములా తీసుకుని జూన్ 6న సిసిలీ ప్రాంతం నుంచి బయల్దేరారు. ఈ సాయంత్రానికి గాజా స్ట్రిప్ చేరుకోవాల్సి ఉండగా.. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ అంత్జాతీయ జలాల్లో వీరిని అడ్డుకుంది. తర్వాత నౌకను ఇజ్రాయెల్ పోర్టుకు మళ్లించాయి. పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కొయలేషన్ అనే సంస్థ చేపట్టిన మిషన్‌లో భాగంగా మానవతా సాయం అందిస్తోంది. కాగా..గ్రెటాను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వార్తలపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. గాజాకు నలువైపులా ఆంక్షలు ఉండటంతో వీరి నౌకను అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అది మానవతా సాయం అందించడం కోసం వస్తోన్న నౌక కాదని, కేవలం సెలబ్రిటీల ‘సెల్ఫీ’ యాత్ర అని ఆరోపించింది. అందులో ఆహార పదార్థాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయని విమర్శించింది.






