- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ లో బీజేపీ నేత దారుణ హత్య.. సీఎం నితీశ్ పై తీవ్ర విమర్శలు
బిహార్ రాష్ట్రం పాట్నా నగరంలో శుక్రవారం రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ రాష్ట్రం పాట్నా నగరంలో శుక్రవారం రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు. 'ట్విన్ టవర్స్' అపార్ట్‌మెంట్ సముదాయంలో నివసిస్తున్న ఖేమ్కా, రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ‘పెనాష్ హోటల్’ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో స్పాట్ లోనే చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక బులెట్ షెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారణం తెలియరాలేదు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కొన్నేళ్ల కింద గోపాల్ ఖేమ్కా కొడుకు కూడా హత్య
గోపాల్ ఖేమ్కా హత్య, బిహార్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ హత్య చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎంపీ పప్పు యాదవ్, ‘నితీశ్ జీ దయచేసి బిహార్‌ను వదిలేయండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. ఆయన బిహార్‌ను ‘గుండా రాజ్యంగా’ తయారు చేశారని విమర్శించారు.
ప్రజలకు భద్రత లేకుండా పోతుంది: ప్రతిపక్షాలు
రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనపై ఆర్జేడీ నేత రిషి మిశ్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాలన తిరోగమనంలో ఉంది. పోలీసులు మద్యం దందాలపై దృష్టి పెట్టడం వల్ల ప్రజలకు భద్రత లేకుండా పోతుందని’ ఆయన ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారన్నారు. ఇలాంటి హత్యలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.






