ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త.. సేకరణ ధర పెంపు !

by velandi.Saikiran |

ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సేకరణ ధర పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త.. సేకరణ ధర పెంపు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉల్లి రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉల్లి సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉల్లి సేకరణ ధరను కిలోకు రూ.12.70 నుంచి రూ. 15.80 కు పెంచింది మోడీ సర్కార్. అంటే బఫర్ స్టాక్ కార్యక్రమం కింద సేకరించే ఉల్లిగడ్డల ధర 24.4% పెరిగింది అన్నమాట. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా. ఉల్లి సేక‌ర‌ణ‌ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మొదలైందని వెల్లడించారు. పెంచిన ధరకు సంబంధించి మే 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధి కింద ఏటా బఫర్ స్టాక్ ను నిర్వహిస్తూ ఉంటుంది కేంద్రం. 2025-261 ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల టన్నుల ఉల్లి సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది దాన్ని రెండు లక్షల టన్నులకు తగ్గించారు. దీని ఫలితంగా రైతులకు మెరుగైన ధర లభించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.

Next Story