నేపాల్‌లో జెన్ జీ నిరసన ఉధృతి.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనానికి యత్నం! కీలక నేతలపై దాడులు

by Ramesh Naini |   (  Updated:2025-09-09 14:21:14  IST  )

మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ భార్యపై జెన్ జీల గుంపు దారుణంగా దాడి చేసి, సజీవంగా ఆమెతో పాటు ఇంటికి నిప్పటించారు.

నేపాల్‌లో జెన్ జీ నిరసన ఉధృతి.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనానికి యత్నం! కీలక నేతలపై దాడులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Nepal) నేపాల్‌లో జెన్ జీ (Gen Z)ల నిరసనలు భయంకరమైన స్థాయికి చేరుకుంది. తాజా ఉద్రిక్తతల్లో, మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ భార్యపై జెన్ జీల గుంపు దారుణంగా దాడి చేసి, సజీవంగా ఆమెతో పాటు ఇంటికి నిప్పటించారు. సోషల్ మీడియా బ్యాన్, అవినీతికి వ్య‌తిరేకంగా జెన్ జీ యువ‌త గత కొన్ని రోజులుగా రోడ్ల‌పైకి వ‌చ్చి లు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో నిరసనలతో ప్రారంభమైన ఉద్యమం, ఇప్పుడు రాజకీయ కుటుంబాలపై లక్ష్యంగా దాడులుగా పాల్పడుతోంది. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli),నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినా కూడా ఆందోళనలు మాత్రం ఆగట్లేదు.

సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష కీలక నేతలను జెన్ జీలు టార్గెట్ చేశారు. మంగళవారం నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పాడేల్‌ను వీధుల్లో పరుగెత్తించి కొట్టారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్‌పై జెన్ జీల గుంపు దారుణంగా దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. నిరసనకారులు వారి నివాసంలో జరిపిన అగ్నిప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అలాగే నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ డియూబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా డియూబాపై తీవ్ర హింసాత్మక దాడి జరిగింది. నిరసనకారులు వారి నివాసంలోకి దూసుకెళ్లి దాడి చేశారు. వారిని ఆర్మీ కాపాడినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, గత రెండు రోజులుగా కొనసాగుతున్న నిరసనల్లో 22 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ట్వీట్ లింక్..

Next Story