- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ ఉద్రిక్తతలతో ఫార్ములా-1 బ్రేక్.. బహ్రెయిన్, సౌదీ గ్రాండ్ ప్రిక్స్ రేసులు రద్దు
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భద్రతా ఆందోళనల దృష్ట్యా, 2026 సీజన్‌లో జరగాల్సిన బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ రేసులను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా వన్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భద్రతా ఆందోళనల దృష్ట్యా, 2026 సీజన్‌లో జరగాల్సిన బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ రేసులను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా వన్ (F1) యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల నేపథ్యంలో క్రీడాకారులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 12న బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్, ఏప్రిల్ 19న సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈవెంట్‌లను నిర్వహించడం అసాధ్యమని అధికారులు తేల్చి చెప్పారు. చైనా గ్రాండ్ ప్రిక్స్‌కు ముందే ఈ రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
రేసుల సంఖ్య తగ్గింపు.. ఐదు వారాల గ్యాప్
ఈ రద్దు వల్ల 2026 ఛాంపియన్‌షిప్ రేసుల సంఖ్య 24 నుంచి 22 కి పడిపోయే అవకాశం ఉందని . ఇప్పటికే బిజీగా ఉన్న షెడ్యూల్ కారణంగా, ఈ రేసులను మళ్ళీ నిర్వహించే (Rescheduling) అవకాశం లేదని తెలుస్తోంది. ఇక, మార్చి 29న జరగనున్న జపాన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత, నేరుగా మే 3న మయామి గ్రాండ్ ప్రిక్స్ జరగనుంది. దీంతో సీజన్ మధ్యలో ఐదు వారాల గ్యాప్ ఏర్పడింది. కేవలం F1 మాత్రమే కాకుండా.. ఫార్ములా 2, ఫార్ములా 3 , ఎఫ్1 అకాడమీ రేసులను కూడా మధ్యప్రాచ్యంలో రద్దు చేసినట్లు జాతీయ మీడియా ది ఫ్రీ ప్రెస్ జర్నల్ స్పష్టం చేసింది.






