- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణరంగంగా మారిన నేపాల్.. మాజీ ప్రధాని భార్య దుర్మరణం
నేపాల్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో నిరసన కారులు మాజీ ప్రధాని ఇంటికి నిప్పుపెట్టగా.. మంటల్లో చిక్కుకొని మాజీ ప్రధాని భార్య ప్రాణాలు కోల్పోయింది.

దిశ, వెబ్ డెస్క్: అంతులేని అవినీతి, సోషల్ మీడియా బ్యాన్ తో నేపాల్ (Nepal) దేశంలో నిరసనలు రణరంగంగా మారాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం రాజధాని ఖాట్మాండ్ (Kathmandu) అంతటా కర్ఫ్యూ విధించింది. అయినప్పటికి నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నిరసనులు తీవ్రతరం కావడంతో నేపాల్ ప్రధాని, కేంద్ర మంత్రులు, అధ్యక్షుడు రాజీనామా చేశారు. అయినప్పటికి నేపాల్ లో హింస (Violence in Nepal) కొనసాగుతూనే ఉంది. రాజకీయ నాయకులే లక్ష్యంగా చేసుకొని నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ మాజీ ప్రధాని జలానథ్ ఖనాల్ (Former Prime Minister Jalnath Khanal) ఇంటిపై దాడి చేసి.. నిప్పు పెట్టారు. ఈ మంటల్లో చిక్కుకొని మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి చిత్తరాక్ (Former Prime Minister's wife Rajyalakshmi Chittara) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నేపాల్‌ను షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అయితే స్వచ్ఛంద సంస్థలు, ఆర్మీ సంస్థలు నేపాల్ లో శాంతి పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి.






