బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం.. మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేదం

by Ajay Maddhiboyina |

బంగ్లాదేశ్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం , ప్రధాని ప‌ద‌వి కోల్పోయిన షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్య‌కలాపాల‌పై నిషేధం కార‌ణంగా ఫిబ్ర‌వరి 2026న జ‌రిగే జాతీయ పార్ల‌మెంటరీ ఎన్నిక‌ల్లో పాల్గొన‌దని స్ప‌ష్టం చేసింది.

బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం.. మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేదం
X

దిశ‌, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం , ప్రధాని ప‌ద‌వి కోల్పోయిన షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్య‌కలాపాల‌పై నిషేధం కార‌ణంగా ఫిబ్ర‌వరి 2026న జ‌రిగే జాతీయ పార్ల‌మెంటరీ ఎన్నిక‌ల్లో పాల్గొన‌దని స్ప‌ష్టం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు ష‌ఫీకుల్ ఆలం ప్రెస్ సెక్ర‌ట‌రీ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం దేశంలో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు నిషేధిందించ‌బ‌డిన అవామీ లీగ్ రాబోయే ఎన్నిక‌ల్లో పాల్గొన‌లేరు అని ప్ర‌క‌టించారు.

అవామీ లీగ్ విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి స్ప‌ష్టంగా ఉంద‌ని అన్నారు. అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేశార‌ని చెప్పారు. ఆ పార్టీ నాయ‌కులు అంత‌ర్జాతీయ నేరాల ట్రిబ్యున‌ల్ లో విచార‌ణ ఎదుర్కొంటున్న కార‌ణంగా ఆ పార్టీ మ‌రియు దాని అనుబంధ సంస్థ‌ల అన్ని కార్య‌క‌లాపాలు నిషేదిస్తూ గెజిట్ నోటిఫికేష‌న్ సైతం జారీ చేశారు. ఇదిలా ఉంటే అవామీ లీగ్ ఎన్నిక‌ల బ‌రిలో లేక‌పోతే అవి ఎన్నిక‌లే కావ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది యూన‌స్ కు ప‌ట్టాభిషేకం లాంటిద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

Next Story