- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్.. అభినందించిన పాక్ మాజీ క్రికెటర్
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉగ్రవాదులకు, అక్కడ వారికి మద్దతు తెలిపిన వారికి ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిపై పాక్ ఉగ్రవాదులకు, అక్కడ వారికి మద్దతు తెలిపిన వారికి ప్రధాని మోడీ (Narendra Modi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికలపై (Former Pakistani cricketer) పాక్ మాజీ క్రికెటర్ స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా (Danish Kaneria) తాజాగా 'ఎక్స్' వేదికగా సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్ ప్రశంసలు కురిపించారు. గాజాలో మాదిరిగానే దక్షిణాసియాలో కూడా ఉగ్రవాద ముగింపునకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు దానిష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ ఇంగ్లీష్‌లో ఉగ్రవాదులకు వార్నింగ్ ఇస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భారత్ నెటిజన్లు డానిష్‌ను అభినందిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సర్ అని పాక్ నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. దేశద్రోహి అంటూ పాక్ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అందులో ఓ కామెంట్‌పై డానిష్ కనేరియా స్పందించారు. డానిష్, నువ్వు ఇక్కడి చాలా మంది భారతీయుల కంటే ఎక్కువగా భారత పౌరుడిగా ప్రవర్తిస్తున్నావని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇందుకు దానిష్ స్పందిస్తూ.. ‘నేను ఒక హిందువు, గర్వంతో చెప్పుకునే హిందువును. ఒక హిందువుగా, నేను జన్మించిన దేశానికి సేవ చేశాను, ఆ దేశం తరఫున ఆడాను, ఎందుకంటే హిందువులు ఎక్కడ జీవించినా తమ దేశానికి నిబద్ధత కలిగి ఉంటారు. పాకిస్తాన్ ప్రజలు నాకు ప్రేమను చూపించారు. కానీ ఇక్కడి పాలకులు పాకిస్తాన్ విభజన సమయం నుంచి నా హిందూ సోదర సోదరీమణులతో ఎలా ప్రవర్తించారో అలాగే వ్యవహరించారు.






