హెలిక్యాప్టర్ కూలిన ఘటనలో మాజీ ఆర్మీ అధికారి మృతి.. గ్రామంలో విషాద చాయలు

by Shamantha N |

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జైపూర్ శాస్త్రీ నగర్ వాసి లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) రాజ్‌వీర్ సింగ్ చౌహాన్ మరణించగా వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

హెలిక్యాప్టర్ కూలిన ఘటనలో మాజీ ఆర్మీ అధికారి మృతి.. గ్రామంలో విషాద చాయలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జైపూర్ శాస్త్రీ నగర్ వాసి లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) రాజ్‌వీర్ సింగ్ చౌహాన్ మరణించగా వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాజ్ వీర్ సింగ్ కవల పిల్లల పుట్టినరోజు 15 రోజులు ఉందనగా.. హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చౌహాన్ మృతి వార్త తెలిసినప్పటి నుంచి ఆయన నివాసానికి బంధువులు, స్నేహితులు, తరలివస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. రాజ్‌వీర్ ఇక లేడన్న నిజాన్ని ఆయన కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో పూర్తిగా విషాద చాయలు అలుముకున్నాయి. రాజ్‌వీర్ తండ్రి గోవింద్ సింగ్ చౌహాన్ కు ఉదయం 7.45 ప్రాంతంలో రాజ్‌వీర్ సహచరుడు కెప్టెన్ వి.కె. సింగ్ ఫోన్ చేసి ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆ క్షణం తన గుండె బద్ధలైందని రాజ్ వీర్ తండ్రి అన్నాడు.

ఇంట్లో సంబరాలకు రెడీ అవుతుండగా..

కవలల పుట్టినరోజు కోసం జూన్ 25న రాజ్‌వీర్ ఇంటికి రానున్నాడు. కుటుంబం మొత్తం వేడుకలకు సిద్ధమవుతూ, వేదికను బుక్ చేయడం, అతిథుల జాబితా ఖరారు చేయడం లాంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఆ సందడిలో మా ఇంటి తలుపు తెరిచిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంతాపం తెలుపుతున్నారు అని ఆయన తండ్రి వాపోయారు. రాజ్‌వీర్ పదవీవిరమణ అనంతరం ఆర్యన్ ఏవియేషన్‌లో పైలట్‌గా చేరారు. భార్యకు ప్రసవం కావడంతో కొంత విరామం తీసుకుని, నెలన్నర క్రితమే తిరిగి సేవలు ప్రారంభించారు. ప్రమాదం వార్తను భార్యకు చెప్పడానికి తాను ఎంతో శక్తిని కూడగట్టాల్సి వచ్చిందని తండ్రి గోవింద్ సింగ్ చెప్పారు. ఆశాజనకంగా సాగుతున్న జీవితాన్ని ఒక్క క్షణం నాశనం చేసింది. కుటుంబాన్ని విడదీసింది. ఓ ఇంట్లో కవలలు తండ్రిని ఎప్పటికీ చూడలేని పరిస్థితిలో మిగిలిపోయారు. ఈ ఘటనతో జైపూర్ అంతటా విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story