యూత్ కేర్ సెంటర్లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-29 14:04:37  IST  )

జర్మనీలో ఘోర తుపాకీ కలకలం రేగింది. ఉత్తర జర్మనీలోని స్టాడ్ నగరంలో ఉన్న యూత్ కేర్ ఫెసిలిటీలో సోమవారం జరిగిన భారీ కాల్పుల ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

యూత్ కేర్ సెంటర్లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : జర్మనీలో ఘోర సంఘటన కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడ్ నగరంలో ఉన్న యూత్ కేర్ ఫెసిలిటీలో సోమవారం జరిగిన భారీ కాల్పుల ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరకలిలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హాంబర్గ్ కు పశ్చిమంగా దాదాపు 50 వేల జనాభా కలిగిన స్టాడ్ పట్టణ కేంద్రంలోని డాంకర్స్ స్టాస్ వీధిలో ఉన్న ఓ యూత్ సెంటర్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

కాల్పుల సమాచారం అందిన వెంటనే జర్మనీ రక్షక దళాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున అత్యవసర సేవలు, సాయుధ పోలీసు బలగాలు మోహరించి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిలో కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు కూడా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story