ఈహెచ్‌ఎస్ నిధికి 1.5 శాతం వేతన కోత.. జీవో జారీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈహెచ్‌ఎస్ నిధికి 1.5 శాతం వేతన కోత.. జీవో జారీ
X
  • భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా ఒకరికే మినహాయింపు
  • మే నెల జీతం నుంచే అమలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) నిధికి గాను ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుండి 1.5 శాతం మొత్తాన్ని మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నంబర్ 79ను సోమవారం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఈ ఏడాది మే నెల వేతనం (జూన్‌లో చెల్లించేది), ఆ తరువాతి నెలల నుంచి ఈ కటింగ్‌లు వర్తిస్తాయి.

ఒక్కరికే వర్తింపు.. పొరపాటున కట్ అయితే రీఫండ్

భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి అయి మరొకరు పెన్షనర్ అయినా, లేక ఒకే పెన్షనర్ సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రెండూ పొందుతున్నా.. వారిలో ఒకరి నుంచి మాత్రమే ఈహెచ్‌ఎస్ చందాను మినహాయించనున్నారు. ఒకవేళ పొరపాటున ఇద్దరి దగ్గరా కట్ చేసి ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని (రీఫండ్) ప్రభుత్వం స్పష్టం చేసింది. డిడిఓలు ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ఎంఎస్ ద్వారా వివరాలను పరిశీలించి ఒకరికే కట్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ నిధులన్నీ ఉద్యోగుల ఆరోగ్య పథకం హెడ్ ఆఫ్ అకౌంట్‌కు జమ కానున్నాయి.

Next Story