- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ శాఖలో భారీగా బదిలీలు.. 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు స్థానం చలనం
అటవీశాఖలో 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీశాఖలో 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గా పనిచేసిన వీఎస్ఎన్వీ.ప్రసాద్ ను పీసీసీఎఫ్ ఆఫీస్ లో చీఫ్ కన్జర్వేటర్ (ప్లానింగ్ అండ్ విజిలెన్స్)గా నియమించారు. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్డీఓ)గా చిన్నా విశ్వనాథ్ భూసారెడ్డికి ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ /తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న జీబీ.రేఖ భానుకు ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ / పీసీపీఎఫ్ ఆఫీస్ లో విజిలెన్స్-2 డీఎఫ్ఓగా ఎస్.రాజశేఖర్ ను నల్గొండ జిల్లా డీఎఫ్ఓగా బదిలీ చేశారు.
డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఉన్న ముకుంద్ రెడ్డికి ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ గా ప్రమోషన్ కల్పించారు. పీసీసీఎఫ్ ఆఫీస్ లో డిప్యూటీ కన్జర్వేటర్(అడ్మిన్)గా పనిచేస్తున్న సంహితకు డిప్యూటీ కన్జర్వేటర్ గా ప్రమోషన్ కల్పించడంతోపాటు పీసీసీఎఫ్ ఆఫీసులోనే పోస్టింగ్ ఇచ్చారు. దీంతోపాటు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా నరసింహారెడ్డికి ప్రమోషన్ ఇవ్వడంతోపాటు అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు.






