జూనియ‌ర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ.. పోస్టర్‌పై ట్రోల్స్

by velandi.Saikiran |

జూనియ‌ర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ పోస్టర్‌పై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ.. పోస్టర్‌పై ట్రోల్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎన్నో రోజులుగా ఎదురుచూసిన జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాపై బిగ్ అప్డేట్ వ‌చ్చేసింది. వీరి కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పురాణాలతో ముడిపడిన కథతో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడిగా మెరువనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. శివుడి కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం... దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్ తో అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలారు.

ఎన్టీఆర్ సినిమా పోస్ట‌ర్ పై ట్రోల్స్‌

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా పోస్టర్ పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా అనౌన్స్మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్, ఏఐ ద్వారా చేశారంటూ చిత్ర బృందంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను ప్రకటించే ముందు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదని మండిపడుతున్నారు. సింపుల్ గా ఏఐ ద్వారా రెడీ చేసిన పోస్టర్ ను మాత్రమే వదిలారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. గ్రాండ్ ప్రజెంటేషన్, క్వాలిటీ పోస్టర్ లేదా వీడియోతో లంచ్ చేసి ఉంటే బాగుండేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story