- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమి...తెరపైకి జహీర్ ఖాన్ పేరు !
భారత బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ నియామకం అయ్యే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఐలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచిన భారత్, 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాల వల్ల, భారత జట్టు ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటుందని మాజీ క్రికెటర్లు కూడా బహిరంగంగానే చెప్పేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ గురించి కాకుండా కొంతమంది భారత బౌలింగ్ కోచ్ ను మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం మోర్నీ మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్ గా ఉండగా.. అతని స్థానంలో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మోర్నీ మోర్కెల్ కంటే జహీర్ ఖాన్ అనుభవం ఉన్న బౌలర్ అని.. అతని కోచింగ్ భారత జట్టుకు చాలా అవసరమని చెబుతున్నారు. వెంటనే జహీర్ ఖాన్ కు బౌలింగ్ కోచ్ గా అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. అటు ధోనిని మెంటార్ గా నియామకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని బీసీసీఐకి సూచనలు చేస్తున్నారు.






