కేటీఆర్ కు తీవ్ర అనారోగ్యం...రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్‌

by velandi.Saikiran |

జడ్చర్లలో మంగళవారం జరగనున్న పలు కార్యక్రమాలను అనారోగ్యం కారణంగా కేటీఆర్ రద్దు చేసుకున్నారు.

కేటీఆర్ కు తీవ్ర అనారోగ్యం...రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్‌
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : జడ్చర్ల నియోజకవర్గంలో మంగళవారం జరగనున్న పలు కార్యక్రమాలను అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రద్దు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన స్థానంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. గత రెండు, మూడు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు కేటీఆర్. దీంతో కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. సోమవారం వరంగల్ జిల్లా పర్యటన రద్దు చేసుకున్న కేటీఆర్...మంగళవారం జడ్చర్లలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితులు లేకపోవడంతో.. ఆయన స్థానంలో హరీష్ రావు పర్యటన ఖరారు అయ్యింది. ఇక మంగ‌ళ‌వారం ఉదయం మిడ్జిల్ కు చేరుకొని స్థానికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొని, జడ్చర్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకానున్నారు హ‌రీష్ రావు. ఈ మేరకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story