- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్.. సర్జరీ అవసరమన్న వైద్యులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెల్డ్ అప్డేట్ వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెల్డ్ అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కు సోమవారం రాత్రి 9 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే రెండు భుజాలను నిశితంగా పరీక్షించారు వైద్యులు. రొటేటర్ కఫ్ తో పాటు పవన్ భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.
తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచనలు చేశారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సర్జరీకి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది
— JanaSena Party (@JanaSenaParty) June 29, 2026
•శ్రీ @PawanKalyan గారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించిన వైద్యులు
•అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్…






