ఐర్లాండ్ లో వైభ‌వ్ ఫాలోయింగ్ చూడండి

by velandi.Saikiran |

ఐర్లాండ్ లో వైభ‌వ్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ఆటోగ్రాఫ్ ల కోసం జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు.

ఐర్లాండ్ లో వైభ‌వ్ ఫాలోయింగ్ చూడండి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ టోర్నమెంట్ లో అదరగొట్టిన వైభవ్ సూర్య వంశీ, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ల కోసం బీసీసీఐ సెలెక్ట్ కూడా చేసింది. దురదృష్టవశాత్తు ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ కు అవకాశం రాలేదు. భారత జట్టులో తీవ్ర‌మైన‌ పోటీ నెలకొన్న నేపథ్యంలో వైభవ్ ను ఆడించలేదు గంభీర్.

చాలా మంది సోషల్ మీడియా వేదికగా దీనిపై డిమాండ్ చేసినప్పటికీ కూడా, వైభవ్ ను ఆడించకుండా పెద్ద తప్పిదమే చేసింది భారత జట్టు యాజమాన్యం. ఇది ఇలా ఉండగా ఐర్లాండ్ సిరీస్ ఓడిపోయిన భారత జట్టు.. అక్కడి నుంచి ఇంగ్లాం డ్ ప్రయాణమైంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ కోసం క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు.

ఐర్లాండ్ లో సెటిల్ అయిన కొంతమంది ఇండియన్స్, వైభవ్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. మరి కొంతమంది అతనితో ఆటోగ్రాఫ్ తీసుకొని సంబరపడిపోయారు. భారత జట్టు ప్లేయర్లు దాదాపు 15 మంది ఉండగా... కేవలం వైభవ్ కోసమే జనాలు ఎగబడి వచ్చి ఆటోగ్రాఫర్లు తీసుకున్నారు. ఈ వీడియో వైర‌ల్ గా మార‌గా, వైభ‌వ్ ఫాలోయింగ్ చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

Next Story