ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్యూ...మందకృష్ణ బ‌హిరంగ లేఖ‌

by velandi.Saikiran |

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి మందకృష్ణ బహిరంగ లేఖ రాశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్యూ...మందకృష్ణ బ‌హిరంగ లేఖ‌
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. నాలుగు రోజుల క్రితం ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా సెక్యూరిటీని స‌ర్కార్‌ తొలగించింద‌ని లేఖ‌లో వివ‌రించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని మండిప‌డ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత, మాజీ పోలీస్ అధికారికి సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని నిల‌దీశారు. వెంటనే ఆయ‌న‌కు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ, లేఖ రాశారు.





Next Story