- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాప్ తీరు మారదు.. రైతుల గోస తీరదు!
తాడ్వాయి మండల పరిధిలో యూరియా బుకింగ్ యాప్ సాంకేతిక లోపాల వల్ల రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.

తాడ్వాయి మండల పరిధిలో యూరియా బుకింగ్ యాప్ సాంకేతిక లోపాల వల్ల రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వర్షాలు పడి సాగు పనులు ముమ్మరమైన వేళ ఎరువుల కోసం అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. యూరియా కోటాను పొందేందుకు తెల్లవారుజామున 5గంటల నుంచే రైతులు ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. గంటల తరబడి ప్రయత్నించినా సర్వర్ డౌన్ కావడంతో యాప్ కనీసం ఓపెన్ కావడం లేదు. ఒకవేళ యాప్ ఓపెన్ అయినా అందులో జిల్లాను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మాయమవ్వడం గమనార్హం. మరికొందరికి సెక్యూరిటీ అలర్ట్ అంటూ ఎర్రర్ మెసేజ్‌లు వస్తుండడంతో బుకింగ్ నిలిచిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యాప్ లోపాలను సరిచేసి సజావుగా ఎరువులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
దిశ, తాడ్వాయి : ఎట్టకేలకు వర్షాలు కురవడంతో పొలం పనులు ఊపందుకుంటుంటే.. మరోవైపు యూరియా కొనుగోలు కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాంకేతికతను జోడించి సులువుగా ఎరువులు అందించేందుకు రూపొందించిన అధికారిక యాప్, ప్రస్తుతం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి తాడ్వాయి మండలంలో యూరియా బుక్ చేసుకుందామంటే యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతాంగం, యూరియా కోసం తెల్లవారుజామున 5గంటల నుంచే నిద్రలేచి మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుందో, ఎప్పుడు బుకింగ్ అవుతుందో తెలియక గంటల తరబడి ప్రయత్నించినా ‘సర్వర్ బిజీ’ అంటూ దర్శనమిస్తుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీరొక్క సమస్యలు, ఐటీ లోపాలు..
ఈ యాప్‌లో సమస్యలు ఒకటా రెండా.. అన్నీ లోపాలే అన్నట్లుగా తయారైంది. ఎవరైనా అదృష్టం బాగుండి యాప్‌లోకి లాగిన్ అయినా, అందులో జిల్లా ఎంచుకునే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో బుకింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరికొందరి ఫోన్లలో యాప్ ఓపెన్ చేయగానే ‘సెక్యూరిటీ అలర్ట్’ అంటూ ఎర్రర్ మెసేజ్‌లు వస్తుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. సాంకేతికత అనేది శ్రమను తగ్గించడానికి ఉపయోగపడాలి కానీ, తమను మరింత మానసిక క్షోభకు గురిచేసేలా ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ లోపాలను తక్షణమే సరిచేసి రైతులు సులభంగా యూరియా పొందేలా చర్యలు చేపట్టాలని ఉమ్మడి తాడ్వాయి మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.






