- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పాఠశాల సిబ్బంది చేతిలో గాయాలపాలైన విద్యార్థి తండ్రి
by Batti.Sumithra |
సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో గల స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాల సిబ్బంది సోమవారం పాఠశాలలోని ఓ విద్యార్థి తండ్రి పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

X
దిశ, చివ్వేంల : సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో గల స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాల సిబ్బంది సోమవారం పాఠశాలలోని ఓ విద్యార్థి తండ్రి పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్న ఆటోలో 25 మంది విద్యార్థులను తీసుకెళ్తుండడం పై స్కూల్ సిబ్బందిని విద్యార్థి తండ్రి ప్రశ్నించగా, ఆగ్రహానికి గురైన సిబ్బంది ఇనుప రాడ్‌తో ఆయనపై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






