- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల దీవెనతో సీఎం సభ విజయవంతం : పున్న కైలాష్ నేత
ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ బహిరంగ సభ విజయవంతమైందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, నల్గొండ బ్యూరో: ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ బహిరంగ సభ విజయవంతమైందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక యాదవ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల ఆదరణ ఉందని ఈ సభ మరోసారి నిరూపించిందన్నారు. దీంతో ప్రతిపక్షాలు దిక్కుతోచక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. సభకు భారీగా హాజరైన మహిళలకు సీఎం అండగా నిలుస్తూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు మరోసారి ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే జిల్లాకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, నెల్లికల్, కిష్టరాంపల్లి, బ్రాహ్మణ వెల్లంల, చర్లగూడెం రిజర్వాయర్‌లను పూర్తి చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని సీఎం హామీ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజల నుంచి మద్దతు కోరేందుకు చెప్పుకోదగ్గ అంశాలు లేవని విమర్శించారు. ఈ సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎండీ ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, దామనూరి అశోక్, చర్లపల్లి గౌతమ్, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండీ అజీజ్, సయ్యద్ నాగుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






