- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : ఎమ్మెల్యే వెంకట్రావు
సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.

దిశ, భద్రాచలం : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) భద్రాచలం డివిజన్ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన పై విధంగా స్పందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నం మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) భద్రాచలం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా భూక్య రంజిత్ నాయక్, ఉపాధ్యక్షుడిగా బండారి మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా పరుచూరి రవీంద్రబాబు, కోశాధికారిగా బొల్లె రాంబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా శ్రీహరి, కార్యదర్శిగా జయరాం, కోశాధికారిగా బాల కిరణ్‌లను ఎన్నుకున్నారు.






