- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India: భారత బాండ్లపై గోల్డ్‌మన్ శాక్స్ బుల్లిష్
ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు కనిపించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గిందని సంస్థ విశ్లేషించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ సానుకూల వైఖరిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా 30 ఏళ్ల గడువు ఉన్న ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయాలని పెట్టుబడిదారులకు సూచించింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు కనిపించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గిందని సంస్థ విశ్లేషించింది. అలాగే అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇదివరకు ఊహించిన స్థాయిలో తీవ్ర ఆర్థిక ప్రభావం చూపలేదని, పరిస్థితులు క్రమంగా స్థిరపడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులకు మరింత అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో భారత ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. జూన్ నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 39,700 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేశారు. విదేశీ పెట్టుబడులపై పన్ను సడలింపులు, సూచీల్లో చేరేందుకు అర్హత ఉన్న బాండ్ల పరిధిని విస్తరించడం ఈ ప్రవాహానికి ప్రధాన కారణాలుగా గోల్డ్‌మన్ పేర్కొంది. త్వరలో భారత్ బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ అగ్రిగేట్ బాండ్ ఇండెక్స్‌లో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉందని, అలా జరిగితే సుమారు 15 బిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశముందని సంస్థ అంచనా వేసింది. ఇది భారత రుణ మార్కెట్‌కు మరో పెద్ద ఊపునివ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.






