రాజశ్యామల హోమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

by Kodari Anjali |

నాచారం మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో న్యూ రాఘవేంద్ర నగర్‌లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం రాజశ్యామల హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

రాజశ్యామల హోమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, నాచారం: నాచారం మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో న్యూ రాఘవేంద్ర నగర్‌లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం రాజశ్యామల హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ.. తనకు వరుసగా పది సంవత్సరాల పాటు నాచారం డివిజన్ కార్పొరేటర్‌గా సేవ చేసే అవకాశం కల్పించిన నాచారం, హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐశ్వర్యసంపదలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ రాజశ్యామల హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి దేవీ అనుగ్రహం కోరినట్లు పేర్కొన్నారు.

Next Story